రావణ్ వెనుక కీలక సూత్రదారులు: కోర్టులో పోలీసుల కస్టడీ పిటిషన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-17 12:15:49  IST  )

ఏపీ ప్రభుత్వంతో పాటు హిందూ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి యూట్యూబర్ రావణ్ అరెస్ట్ అయి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని గన్నవరం పోలీసులు కోరుతున్నారు..

రావణ్ వెనుక కీలక సూత్రదారులు: కోర్టులో పోలీసుల కస్టడీ పిటిషన్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం(Ap Government)తో పాటు హిందూ మతం(Hindu Religion)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి యూట్యూబర్ రావణ్(Youtuber Ravan) అరెస్ట్ అయి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని గన్నవరం పోలీసులు కోరుతున్నారు. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యూట్యూబర్ రావణ్‌ను మరింత విచారించాలని ఈ మేరకు 15 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్‌లో దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

ముమ్మరంగా దర్యాప్తు

అయితే ఇప్పటికే ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు కస్టడీ పిటిషన్‌లో కీలక విషయాలు పొందుపర్చారు. బెంగళూరు, హైదరాబాద్ కేంద్రంగా రావణ్, గమన, ఇంద్రసేన నాయుడు కలిసి పలు డిజిటల్ కార్యకాలపాలు నడిపినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. హైదరాబాద్ బెంగళూరులో మొబైల్, ల్యాప్ టాప్ సహా పలు ఎలక్ర్టానిక్ పరికరాలు డిజిటల్ స్టోరేజ్ పత్రాలను స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. రావణ్ వెనుక కొందరు కీలక వ్యక్తుల ప్రమేయం ఉందని, ఆర్థిక లావాదేవీలు, నిధులు వంటి కీలక వివరాలు పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకకు చెందిన పలువురితోనూ రావణ్ సంప్రదింపులు జరిపినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.

Next Story