రైతులకు పంట మార్పిడి విధానం పై అవగాహన కల్పించాలి

by Taduka Kalyani |

రైతులు పంట మార్పిడి సాగును చేసుకునేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు.

రైతులకు పంట మార్పిడి విధానం పై అవగాహన కల్పించాలి
X

దిశ, వికారాబాద్ ప్రతినిధి: రైతులు పంట మార్పిడి సాగును చేసుకునేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నాబార్డ్ ఫౌండేషన్ భాగస్వామి పక్షాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ రైతులు చిరుధాన్యాలు పప్పు దినుసుల పంటల సాగుకు ప్రోత్సహించాలన్నారు. ఎల్ఈనో ప్రభావం వల్ల వర్షాలు తక్కువ కురిసే అవకాశం ఉన్నందున నీటి ఆధారిత పంటలను సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు రైతుల అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. పండ్ల కూరగాయల ఉద్యానవన పంటల సాగుపై అవగాహన కల్పించడంతోపాటు సాంకేతికతను ఉపయోగించి పంటల ఉత్పత్తిని పెంచుకునే విధంగా రైతులకు సూచనలు ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. నాబార్డ్ ద్వారా వ్యవసాయ రంగానికి వివిధ పథకాలకు సహకారం అందిస్తుందో రైతులకు తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు. స్వయం సహాయక సంఘాలు మహిళా శక్తి రైతు సేవ కేంద్రాల ద్వారా ఎరువులు విత్తనాలను విక్రయించినట్లయితే రైతులకు నమ్మకంతో పాటు సంఘాలకు ఆదాయం చేకూరుతుందని కలెక్టర్ తెలిపారు. ఆయిల్ ఫామ్ పంట సాగుకు రైతులను ప్రోత్సహించాలనికలెక్టర్ తెలిపారు. ఆయిల్ ఫామ్ పంట సాగు వల్ల 30 సంవత్సరాల వరకు ఆదాయం ఉంటుందని అదేవిధంగా అంతర్ పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని రైతులకు సూచించాలని కలెక్టర్ తెలిపారు. ఈసమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ ( ట్రైనీ ) సచిన్ బస్వరాజ్ గుట్టూరు ౠడిహెచ్ఎస్ఓ సత్తార్ డిఆర్డిఓ శ్రీనివాస్ లీడ్ బ్యాంక్ మేనేజర్ యాదగిరి నాబార్డ్ డీడీఎం అఖిల్ స్వయం సహాయక సంఘాల సభ్యులు రైతులు పాల్గొన్నారు.

Next Story