- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వినూత్నంగా 'పళ్ళబురుసు' ఫస్ట్ లుక్.. ఆకట్టుకుంటున్న పోస్టర్
అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ ఓ వినూత్న ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.

దిశ, సినిమా: అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ ఓ వినూత్న ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి ‘పళ్ళబురుసు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయగా.. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగు సంస్కృతి, ప్రాంతీయతను ప్రతిబింబించే ఈ చిత్రం వినోదభరితమైన కామెడీ-డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తండ్రీకొడుకులుగా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. ప్రజ్వల్, గోమతి రెడ్డి, కిరణ్ మాచా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో జిల్లా కోర్టు ఆవరణలో పెద్ద టూత్‌బ్రష్‌ను త్రాసులా రూపొందించి, దానిపై వెన్ను వెన్నుకు ఆనుకుని కూర్చున్న ఇద్దరు ప్రధాన పాత్రధారులను చూపించడం ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ కథ, దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్నారు. వినూత్న కాన్సెప్ట్, ఆకట్టుకునే ఫస్ట్ లుక్‌తో ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన 'పళ్ళబురుసు' 2026 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.






