- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News : జానీ మాస్టర్ కు షాక్
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు (Johny Master) తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ బిగ్ షాక్ ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు (Jani Master) తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఫెడరేషన్ నిబంధనలకు విరుద్ధంగా, సంస్థ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలపై ఆయనను ఆల్ ఇండియా స్థాయిలో ఫిల్మ్ ఫెడరేషన్ నుండి బహిష్కరిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో జానీ మాస్టర్ యూనియన్ సభ్యులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని, ఆయన ప్రవర్తన సంస్థ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించేలా ఉన్నాయని ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ.. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా జులై 14న జరిగిన అంతర్గత విచారణకు హాజరుకావాలని ఫెడరేషన్ జానీ మాస్టర్‌ను ఆదేశించింది. అయితే, ఆయన ఈ విచారణకు హాజరు కాకపోవడంతో ఫెడరేషన్ పెద్దలు మరింత మండిపడ్డారు.
కఠిన చర్యలు
బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు గాను, రాబోయే 7 రోజుల్లోగా దీనిపై పూర్తిస్థాయి లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే, ఇండస్ట్రీ వర్గాలకు బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే కఠిన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జానీ మాస్టర్‌పై బహిష్కరణ వేటు వేసిన నేపథ్యంలో, భవిష్యత్తులో ఆయన కొరియోగ్రఫీ చేసే ఏ సినిమాకైనా, ప్రాజెక్టుకైనా ఫెడరేషన్ తరఫున ఎలాంటి సహకారం (Non-cooperation) అందించబోమని యూనియన్ స్పష్టం చేసింది. ఫెడరేషన్ మళ్లీ తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఈ సహాయ నిరాకరణ దేశవ్యాప్తంగా కొనసాగుతుందని ప్రకటించింది.
జానీ మాస్టర్ భార్య సుమలతకు కూడా హెచ్చరికలు
మరోవైపు డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, జానీ మాస్టర్ భార్య సుమలత తీరుపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అసోసియేషన్‌కు సంబంధించిన జనరల్ బాడీ తీసుకునే నిర్ణయాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని సూచించింది. వ్యక్తిగత ఎజెండాల పక్కనబెట్టి, సాధారణ డ్యాన్సర్ల ఉపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.






