- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైల్వే జీఎం, డీఆర్‌ఎంతో ఎంపీ డాక్టర్ కడియం కావ్య భేటీ
by Kodari Anjali |
కాజీపేట బస్టాండ్ భూకేటాయింపు ప్రక్రియ వేగవంతం చేయాలని వినతి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు దక్షిణ మధ్య రైల్వే అధికారులను కోరారు.

X
దిశ, హనుమకొండ కలెక్టరేట్: కాజీపేటలో ప్రతిపాదిత నూతన బస్టాండ్ నిర్మాణానికి అవసరమైన రైల్వే భూమి కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య దక్షిణ మధ్య రైల్వే అధికారులను కోరారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (జీఎం) సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) డా. ఆర్. గోపాలకృష్ణన్‌లను స్వయంగా కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం భూ మార్పిడి అంశంపై వారితో ఎంపీ విస్తృతంగా చర్చించారు.
Next Story






