- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ రేషన్ బియ్యం దందా బట్టబయలు
రేషన్ కార్డుదారుల నుంచి తక్కువ ధరకు పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి అక్రమంగా విక్రయిస్తున్న వ్యవహారాన్ని మిర్యాలగూడ పోలీసులు ఛేదించారు.

దిశ, మిర్యాలగూడ రూరల్ : రేషన్ కార్డుదారుల నుంచి తక్కువ ధరకు పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి అక్రమంగా విక్రయిస్తున్న వ్యవహారాన్ని మిర్యాలగూడ పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో 36.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి అనంతరం సుమారు ఒంటి గంట సమయంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న రేషన్ దుకాణం నుంచి పీడీఎస్ బియ్యాన్ని ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఏడు కోట్ల తండాకు చెందిన ధీరావత్ అశోక్ కుమార్ ఇన్‌చార్జిగా నిర్వహిస్తున్న రేషన్ దుకాణంలో అక్రమంగా బియ్యం నిల్వ చేసినట్లు గుర్తించారు.
రేషన్ కార్డుదారుల నుంచి తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేసి, భువనగిరి ప్రాంతానికి చెందిన బాణావత్ సాయి భరత్, లావుడియా రవీందర్‌లతో కుమ్మక్కై అక్రమంగా విక్రయిస్తూ లాభాలు పొందుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న సివిల్ సప్లై శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. బియ్యం తరలిస్తున్న వాహనంలో ఉన్న 15 బస్తాలు, రేషన్ దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన 58 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 36.5 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు. సివిల్ సప్లై శాఖ డిప్యూటీ తహసీల్దార్ రావుల సైదులు ఫిర్యాదు మేరకు ఇన్‌చార్జి రేషన్ డీలర్ ధీరావత్ అశోక్ కుమార్‌తో పాటు బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న బాణావత్ సాయి భరత్, లావుడియా రవీందర్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.






