VIRAL: ఆహా.. అదృష్టం అంటే నీదేపో..! అప్పనంగా మహిళకు రూ.1.4 కోట్ల లాటరీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-17 17:26:49  IST  )

అమెరికాలో ఓ మహిళను అదృష్టం వరించింది.

VIRAL: ఆహా.. అదృష్టం అంటే నీదేపో..! అప్పనంగా మహిళకు రూ.1.4 కోట్ల లాటరీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాత్రి వేళ మనం నిద్రపట్టక ఇన్‌స్టా‌గ్రామ్‌ (Instagram)లో రీల్స్, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో వెబ్ సిరీస్‌లు చూడటం అలవాటు. అయితే, ఆ అలవాటే అమెరికాకు చెందిన ఓ మహిళ తలరాతను మార్చేసింది. నిద్రరాక ఫోన్ చూసుకుంటున్న సమయంలో ఆమె ఏకంగా హఠాత్తుగా రూ.1.4 కోట్ల భారీ లాటరీ జాక్‌పాట్‌ను గెలుచుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని నార్త్ కరోలినా, మూర్స్ విల్లేకు చెందిన సూ రౌలీ (Sue Rowley)కి జూలై 8న రాత్రి ఎంతకీ నిద్రపట్టలేదు. బెడ్‌పై అటు ఇటు దొర్లుతూ, సమయం వృథా చేయడం ఎందుకని తన మొబైల్ ఫోన్ తీసుకుని ఆన్‌లైన్‌లో ‘నార్త్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీ’ అఫీషియల్ యాప్‌ను ఓపెన్ చేసింది. అందులో కేవలం ఒకే ఒక్క డాలర్ అంటే భారత కరెన్సీలో సుమారు రూ.84 పెట్టి ‘క్యాష్ 5’ అనే ఆన్‌లైన్ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసింది.

ఆ మరునాడు ఉదయం..

అయితే, ఆ మరునాడు ఉదయం నిద్ర లేచి చూసేసరికి ఆమెకు సంబంధిత లాటరీ ఆఫీసు నుంచి ఓ ఈమెయిల్ వచ్చింది. అందులో ఆమె ఏకంగా 1,67,419 డాలర్లు భారత కరెన్సీలో సుమారు రూ.1.4 కోట్లు గెలుచుకున్నట్లు ఉంది. మొదట ఆ మెయిల్ చూసి ఆమె నమ్మలేకపోయింది. ఏదో పొరపాటు జరిగి ఉంటుందని భావించింది. కానీ, లాటరీ ఆఫీసుకు వెళ్లి కన్ఫామ్ చేసుకున్నాకా.. ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ‘రాత్రి నిద్రపట్టకపోవడం నా జీవితంలో ఇంత పెద్ద అదృష్టాన్ని తెస్తుందని అస్సలు ఊహించలేదు’ అని సూ రౌలీ కామెంట్ చేశారు. ట్యాక్స్ డిటెక్షన్ త్వారత ఆమెకు రూ.1 కోటి రూపాయల నగదు చేతికి అందింది. ఈ డబ్బుతో తన ఇంటికి సంబంధించిన కొన్ని అప్పులను తీర్చుకుంటానని సూ రౌలీ తెలిపింది.

Next Story