లార్డ్స్ చేరుకున్న రోహిత్ శర్మ పేరెంట్స్..ఇక‌ రిటైర్మెంటే!

by velandi.Saikiran |

బీసీసీఐ ఒత్తిడి మేరకు తలోగ్గిన రోహిత్ శర్మ... ముందుగానే రిటైర్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు.

లార్డ్స్ చేరుకున్న రోహిత్ శర్మ పేరెంట్స్..ఇక‌ రిటైర్మెంటే!
X

దిశ‌, వెబ్ డెస్క్: భార‌త మాజీ కెప్టెన్‌ రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు నిన్నటి నుంచి వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ తో జరిగే మూడో వన్డే ముగిసిన వెంటనే, లార్డ్స్ వేదికగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తారని జాతీయ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. 2027 వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో రోహిత్ శర్మను పరిగణలోకి తీసుకోవడం లేదని ఇప్పటికే బీసీసీఐ పెద్దలు స్పష్టం చేశారట.

దీంతో బీసీసీఐ ఒత్తిడి మేరకు తలోగ్గిన రోహిత్ శర్మ... ముందుగానే రిటైర్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ తల్లిదండ్రులు లండన్ చేరుకున్నట్లు వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. తన కొడుకు చివరి మ్యాచ్ చూడాలన్న కోరిక మేరకు తాజాగా లార్డ్స్ చేరుకున్నారట. తల్లిదండ్రులు కూడా లార్డ్స్ చేరుకున్న నేపథ్యంలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇవ్వడం దాదాపు ఖరారు అయినట్లేనని సోషల్ మీడియాలో మరో చర్చ మొదలైంది.

Next Story