- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళల భద్రతలో పురుషుల భాగస్వామ్యం కీలకం: డీజీ చారు సిన్హా
మహిళలపై అకృత్యాలను అరికట్టడంలో, వారి భద్రతను కాపాడటంలో పురుషులు, అబ్బాయిల భాగస్వామ్యం కీలకమని తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారు సిన్హా పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : మహిళలపై అకృత్యాలను అరికట్టడంలో, వారి భద్రతను కాపాడటంలో పురుషులు, అబ్బాయిల భాగస్వామ్యం కీలకమని తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారు సిన్హా పేర్కొన్నారు. పురుషుల్లో ప్రవర్తనా మార్పు తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ పోలీసులు చేపట్టిన స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్‌ను రాష్ట్రవ్యాప్తంగా చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టినట్టు తెలిపారు. దీంట్లో భాగంగా యూసుఫ్‌గూడలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంఎస్‌ఎంఈలో అధ్యాపకులకు ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ కళాశాలల నుంచి వచ్చిన లెక్చరర్లకు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ ఇచ్చారు. అబ్బాయిల్లో మహిళల పట్ల గౌరవాన్ని పెంపొందించడం, లింగ వివక్షను పారద్రోలడం, అసభ్యకరమైన ప్రవర్తనను ప్రశ్నించేలా చైతన్యపరచడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని చారు సిన్హా తెలిపారు.
కళాశాలల్లో ఈ క్యాంపెయిన్‌ను విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారా సమాజంలో సురక్షిత వాతావరణాన్ని సృష్టించవచ్చారు. లింగ ఆధారిత హింసను నివారించాలంటే చట్టాలతో పాటు పురుషుల ఆలోచనా దృక్పథం మారాలని డీజీ చారు సిన్హా పేర్కొన్నారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ ట్రైనింగ్ హెడ్ ఆసియా షేర్వానీ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణలో లింగ సున్నితత్వం, బైస్టాండర్ ఇంటర్వెన్షన్‌పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఐజీ పరిమళ హనా నూతన్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.






