వేపచెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

by Ratna Kumari |

మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామ శివారులో ఓ వ్యక్తి వేపచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

వేపచెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, మునగాల : మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామ శివారులో ఓ వ్యక్తి వేపచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెన్‌పహాడ్ మండలంలోని భక్తాలాపురం గ్రామానికి చెందిన చిట్యాల లింగయ్య (45) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. గురువారం మునగాల గ్రామంలో నివసిస్తున్న తన అత్తగారింటికి వచ్చిన లింగయ్య, రాత్రి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే స్వగ్రామానికి వెళ్లకుండా తాడువాయి గ్రామ శివారులోని ఓ రైతు పొలంలో ఉన్న వేపచెట్టుకు తన లుంగీని ఉరితాడుగా బిగించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంజీవరెడ్డి తెలిపారు.

Next Story