వర్షాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయండి : తెలంగాణ వక్ఫ్ బోర్డు ఆదేశం

by Muthe.Rajitha |

రాష్ట్రంలో ప్రస్తుత రుతుపవనాల సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక, కరవు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ వక్ఫ్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

వర్షాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయండి : తెలంగాణ వక్ఫ్ బోర్డు ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రస్తుత రుతుపవనాల సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక, కరవు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ వక్ఫ్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవాలని కోరుకుంటూ మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు (దువా) నిర్వహించాలని బోర్డు ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) ఒక అధికారిక సర్క్యులర్‌ను జారీ చేశారు. రాష్ట్రంలోని మసీదులకు సంబంధించిన ఇమామ్‌లు, మౌజన్‌లు అందరూ తమ తమ ప్రాంతాలలో సమృద్ధిగా వర్షాలు పడాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. దీనితో పాటు, రాష్ట్రంలోని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారులు అందరూ ఈ విషయంపై విస్తృత ప్రచారం కల్పించాలని, ఆయా ప్రాంతాల్లోని మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వక్ఫ్ బోర్డు స్పష్టం చేసింది.

Next Story