యువతి ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు.. ముగ్గురిపై ఆరోపణలు

by Kodari Anjali |

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడమంచ్య తండాకు చెందిన బానోతు తనుశ్రీ (19) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

యువతి ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు.. ముగ్గురిపై ఆరోపణలు
X

దిశ, కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడమంచ్య తండాకు చెందిన బానోతు తనుశ్రీ (19) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాటోత్ సీతారం, జాటోత్ అమ్మి, జాటోత్ రమ్య అనే ముగ్గురు గత రెండు రోజులుగా తన కుమార్తెను పదేపదే అవమానించడం, దుర్భాషలాడడం, నలుగురి మధ్య పరువు తీయడంతో పాటు “నీవు బతకకూడదు.. చనిపో” అంటూ మానసికంగా వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వేధింపుల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన తనుశ్రీ తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదులో వెల్లడించారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు కొనసాగుతున్నట్లు కేసముద్రం ఎస్‌ఐ కె. క్రాంతి కిరణ్ తెలిపారు.

Next Story