ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య

by Taduka Kalyani |

ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య
X

దిశ, రాజేంద్రనగర్ : ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ ముత్తు యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం... నార్సింగి లో నివాసం ఉంటూ గచ్చిబౌలిలోని ఐసిఐసిఐ బ్యాంకులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ముల్లంగి ప్రవీణ్ (27) లార్డ్స్ కాలేజ్ సమీపంలోని చెట్టుకు శుక్రవారం ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ మధ్య ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. స్థానికులు గుర్తించి రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story