- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటరు జాబితా ప్రక్షాళన కు సహకరించాలి : ఎమ్మెల్యే
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎంఎస్ కన్వెన్షన్ లో మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పై అవగాహన సదస్సు నిర్వహించారు.

దిశ, శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎంఎస్ కన్వెన్షన్ లో మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితాను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి పారదర్శకంగా రూపొందించేందుకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ముఖ్యమైన ప్రక్రియ అని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా డూప్లికేట్ ఓట్లు, మరణించిన వారి పేర్లు తొలగించడంతో పాటు అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించేలా ఓటరు జాబితాను సరిచేస్తారని వివరించారు. ప్రతి ఓటరు తమ వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు, చేర్పులు చేసుకుని ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించాలని సూచించారు. మాజీ కార్పొరేటర్ సాయిబాబా మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్ చేపట్టిన రహదారులు, తాగునీరు, మౌలిక వసతులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కనిపిస్తున్నాయనే తెలిపారు.యువ సంగ్రామ సభ” నిరుద్యోగ యువత సమస్యలు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగాల కల్పన, యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై నిర్వహించబడుతున్న ముఖ్యమైన కార్యక్రమమని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో రాగం జంగయ్య యాదవ్ గలాల్, నల్లగండ్ల డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాగం హరి శంకర్ యాదవ్, నల్లగండ్ల డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజు ముదిరాజ్, బిక్షపతి, చెన్నంరాజు, యాదగిరి, పరమేశ్, భీమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.






