కఠిన చర్యలు తప్పవు: వాహనదారులకు మంత్రి పొన్నం హెచ్చరిక

by Vemula.Srinu Prasad |

రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలను మరింత విస్తృతంగా చేపట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు....

కఠిన చర్యలు తప్పవు: వాహనదారులకు మంత్రి పొన్నం హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలను మరింత విస్తృతంగా చేపట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. రవాణా కమిషనర్ కార్యాలయంలో రవాణా శాఖ అధికారులతో సమీక్షలో ఆయన కీలక అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఓవర్‌లోడింగ్ చేస్తున్న వాహనాలు, త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాలు, ఫిట్‌నెస్ లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనాలను అవసరమైతే సీజ్ చేయాలని ఆదేశించారు. చెక్‌పోస్టులు రద్దు చేసిన సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను బలోపేతం చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేసిన మంత్రి... ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిబ్బందిని మరింత సమర్థవంతంగా వినియోగించి తనిఖీలను పెంచాలని సూచించారు.

జూన్ 8 నుండి ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా వేసిన మొబైల్ స్క్వాడ్ ల పని తీరును సమీక్షించారు. త్రైమాసిక పన్నులు చెల్లించని వాహన యజమానులపై భారీ జరిమానాలు విధించడంతో పాటు వాహనాలను సీజ్ చేయాలని పేర్కొన్నారు.అలాగే ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని స్లీపర్ బస్సుల్లో నిబంధనల ఉల్లంఘనలను ఏమాత్రం ఉపేక్షించవద్దని, ఉల్లంఘనలు గుర్తించిన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, అడిషనల్ కమిషనర్ కమిషనర్ రమేష్, జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లు చంద్రశేఖర్ గౌడ్, శివ లింగయ్య డీటీసీలు రవీందర్ కుమార్, వెంకటరమణ, సురేష్ రెడ్డి, ప్రమీల, వాణి, సదానందం, ఆఫ్రిన్ ఓఎస్డీ సైదులు పాల్గొన్నారు.

Next Story