హైడ్రా కంచె తొలగించి పార్కు భూమి ఆక్రమణ యత్నం.. ఇద్దరిపై కేసు..

by Kodari Anjali |

హైడ్రా ఏర్పాటు చేసిన కంచె, సైన్‌బోర్డులను తొలగించిన ఘటనపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

హైడ్రా కంచె తొలగించి పార్కు భూమి ఆక్రమణ యత్నం.. ఇద్దరిపై కేసు..
X

దిశ, మేడిపల్లి: చెంగిచెర్ల చిన్న క్రాంతి కాలనీలో ప్రజా పార్కుగా కేటాయించిన 1,800 చదరపు గజాల భూమిని ఆక్రమించేందుకు హైడ్రా ఏర్పాటు చేసిన కంచె, సైన్‌బోర్డులను తొలగించిన ఘటనపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా హైడ్రా ఇన్‌స్పెక్టర్ జి. రాజశేఖర్ ఫిర్యాదు మేరకు, కాలనీ అధ్యక్షుడు బాపు రాజు, చెవెళ్ల శ్రీనివాస్ కలిసి పార్కు భూమిలోకి అక్రమంగా ప్రవేశించి హైడ్రా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను తొలగించి ఆక్రమణకు యత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నారు.

Next Story