- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిచ్కుంద షాప్ చోరీ కేసు ఛేదన
బిచ్కుంద గ్రామంలోని రాయల్ వెల్డింగ్ షాప్‌లో జరిగిన చోరీ కేసును బిచ్కుంద పోలీసులు ఛేదించారు.

దిశ, బిచ్కుంద (మద్నూర్) : బిచ్కుంద గ్రామంలోని రాయల్ వెల్డింగ్ షాప్‌లో జరిగిన చోరీ కేసును బిచ్కుంద పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి, వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 15వ తేదీ రాత్రి రాయల్ వెల్డింగ్ షాప్ షట్టర్ తాళం పగులగొట్టి రూ.10 వేల విలువైన వివో మొబైల్ ఫోన్‌ను దొంగలు అపహరించారు. అనంతరం అయ్యప్ప టెంపుల్ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు.
అరెస్టైన వారిలో కుంచెపు గౌరి అలియాస్ రవి (హైదరాబాద్–కర్నూలు ప్రాంతం), మురళి ప్రధాన్ (ఒడిశా) ఉన్నారు. వారి నుంచి బాధితుడికి చెందిన వివో మొబైల్‌తో పాటు మరో మూడు స్మార్ట్‌ఫోన్లు, ఒక హోండా షైన్ మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో దొంగతనం కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా బిచ్కుంద ఎస్సై రాజు మాట్లాడుతూ, రాత్రి వేళల్లో దుకాణాలకు బలమైన తాళాలు, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వ్యాపారులకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే డయల్-100కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






