త్వరలో పటేల్ కుంట చెరువుకు మోక్షం.. పరిశీలించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

by Kodari Anjali |

నాచారం డివిజన్ ఎర్రగుంట లోని పటేల్ కుంట చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క తొలగింపు పనులు పూర్తయిన నేపథ్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శుక్రవారం చెరువును సందర్శించారు.

త్వరలో పటేల్ కుంట చెరువుకు మోక్షం.. పరిశీలించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
X

దిశ, నాచారం: నాచారం డివిజన్ ఎర్రగుంట లోని పటేల్ కుంట చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క తొలగింపు పనులు పూర్తయిన నేపథ్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శుక్రవారం చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా చెరువు పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే స్థానిక బస్తివాసులు, నాయకులతో మాట్లాడారు. పటేల్ కుంట చెరువును కూడా హెచ్ఎంటీ నగర్ చెరువు తరహాలో సుందరీకరణ చేసి అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. చెరువు అభివృద్ధి పనులతో స్థానికులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు, పరిసర ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సాయిజెన్, శేఖర్, మేడల మల్లికార్జున గౌడ్, మారయ్య, శివకుమార్, యూసుఫ్, ప్రభాకర్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Next Story