- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంజాబ్ పర్యటన.. ప్రధాని మోడీ న్యూ లుక్
ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన సందర్భంగా మరో లుక్‌లో దర్శనమిచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన సందర్భంగా మరో లుక్‌లో దర్శనమిచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. పంజాబ్‌లోని జలంధర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరైన ప్రధాని మోడీ, సిక్కుల అత్యంత పవిత్రమైన, సాంప్రదాయక తలపాగా అయిన 'దస్తర్' అంటే ఆకుపచ్చ రంగు తలపాగా ధరించి వేదికపైకి రావడం విశేషం. పంజాబ్ రైతాంగ అస్తిత్వానికి, అక్కడి సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ ఆకుపచ్చ తలపాగా లుక్ రాజకీయ వర్గాలలోనూ, ప్రజలలోనూ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈ పర్యటనలో భాగంగా దేశంలో రవాణా, రోడ్డు, రైల్వే మౌలిక సదుపాయాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు రూ. 5,470 కోట్ల విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోడీ జలంధర్ వేదికగా వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ అమృత్‌సర్ (ఛెహర్తా) నుండి వారణాసిని కలుపుతూ నూతనంగా ఏర్పాటు చేసిన "సంత రవిదాస్ ఎక్స్‌ప్రెస్" రైలును ఆయన పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అమృత్‌సర్, వారణాసి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల మధ్య నేరుగా ప్రయాణించాలనుకునే భక్తులకు, ముఖ్యంగా రవిదాసియా సమాజానికి ఈ రైలు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.
దీనితో పాటు, దేశవ్యాప్తంగా 'అమృత్ భారత్ స్టేషన్ పథకం' కింద అత్యాధునిక హంగులతో, ఆధునిక సదుపాయాలతో పునర్నిర్మించిన 75 రైల్వే స్టేషన్లను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. దాదాపు రూ. 1,570 కోట్ల వ్యయంతో ఆధునీకరించబడిన ఈ స్టేషన్లలో స్థానిక సంస్కృతి, వారసత్వం ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయడం విశేషం. అంతకుముందే హరియాణాలోని జింద్ (Jind) రైల్వే స్టేషన్ వేదికగా దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన ఆధారిత (Hydrogen-powered) ప్యాసింజర్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. గ్రీన్ ఎనర్జీ రంగానికి పెద్దపీట వేస్తూ పూర్తిగా భారత్‌లోనే 'మేక్ ఇన్ ఇండియా' సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఈ సరికొత్త రైలు హరియాణాలోని జింద్ - సోనిపట్ మధ్య దాదాపు 89 కిలోమీటర్ల మార్గంలో పైలట్ ప్రాజెక్ట్ కింద నడవనుంది. ఈ హైడ్రోజన్ రైలు ప్రారంభోత్సవంతో పాటు హరియాణాలో రూ. 12,470 కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులను కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు.






