అర్జీ-2లో కార్మికుల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలి

by Kodari Anjali |

సింగరేణి సంస్థ రామగుండం రీజియన్-2 డివిజన్ పరిధిలోని వివిధ విభాగల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలకు యాజమాన్యం తక్షణమే పరిష్కారం చూపాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు.

అర్జీ-2లో కార్మికుల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలి
X

దిశ, యైటింక్లయిన్ కాలనీ: సింగరేణి సంస్థ రామగుండం రీజియన్-2 డివిజన్ పరిధిలోని వివిధ విభాగల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలకు యాజమాన్యం తక్షణమే పరిష్కారం చూపాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో యాజమాన్యం, గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీతో స్ట్రక్చర్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సందర్బంగా యూనియన్ నాయకులు డివిజన్ పరిధిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏరియా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య దృష్టికి తీసుకెళ్లారు. కార్మికుల సంక్షేమం, భద్రత, మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా ఓసీపీ-3లోని ఓసీఎం, జీడీకే -7 ఎల్‌ఈపీ, ఓసీపి స్టోర్స్ కార్మికులకు క్యాంటీన్ సౌకర్యం కల్పించాలని, ఆర్జీ-2 స్టోర్‌లో 1 నుంచి 5 వరకు ఉన్న షెడ్స్ లో టర్బో వెంటిలేటర్ ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఏరియా వర్క్‌షాప్‌లో స్లాటింగ్, షేపింగ్, రేడియల్ డ్రిల్లింగ్ యంత్రాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని, ఫోర్‌మెన్ (ఈ&ఎం) ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సీఈఆర్ క్లబ్‌లో ఇండోర్ షటిల్ కోర్టు నిర్మాణంతో పాటు ప్రవేశ ద్వారం వద్ద పార్కింగ్ షెడ్ నిర్మించాలి, కల్పించాలని, రూమ్స్ ని రిపేర్ చేయించి ఏసీ ఏర్పాటు చేయాలని, ఇండోర్ జిమ్‌ మెటీరియల్ సాధ్యమైంత త్వరగా తెప్పించి అందుబాట్లో ఉంచాలన్నారు.

ఆర్జీ-2 ఉద్యోగులకు సీఎంపిఎఫ్ చిట్టాలను

కంపెనీ అవసర నిమిత్తం సర్ఫేస్ లో డిప్లయ్ చేసిన వకీల్ పల్లి కార్మికులకు అండర్ గ్రౌండ్ అలవెన్స్ రికవరీని వెంటనే నిలిపివేయాలన్నారు. సెక్టార్-3 సింగరేణి సీబీఎస్‌ఈ పాఠశాలకు గతంలో టెండర్లు పూర్తయినప్పటికీ బస్సు సౌకర్యం ప్రారంభం కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ, వెంటనే బస్సు సేవలు ప్రారంభించడంతో పాటు టాయిలెట్ల మరమ్మతులు, తాగునీటి వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. బేస్ వర్క్ షాప్ లో ఈఓటీ క్రేన్‌ను ఏర్పాటు చేయాలని, మెయింటెనెన్స్ సెక్షన్లో ఫిల్టర్ క్లీనింగ్ మెషిన్ లొకేషన్ మార్చాలని అన్నారు.లైట్ మోటార్ వెహికిల్స్ రిపేర్స్ కోసం సపరేట్ సెక్షన్ ఏర్పాటు చేయాలి, ఓసీపీ-3లో ఈపీ ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, ఫోర్‌మెన్ (ఈ&ఎం) ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. అలాగే ఎస్కార్ట్ రిపేర్ కొరకు ర్యాంప్ ఏర్పాటు చేయాలన్నారు.అలాగే ఆర్జీ-2 ఉద్యోగులకు సీఎంపిఎఫ్ చిట్టాలను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే ఉత్పాదకత పెంపుతో పాటు సంస్థ అభివృద్ధికి దోహదపడుతుందని, సమావేశంలో ప్రస్తావించిన తొమ్మిది ప్రధాన సమస్యల పరిష్కారానికి యాజమాన్యం ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. సమస్యల పై సానుకూలంగా స్పందించిన జీఎం సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్వో టూ జీఎం మాలోత్ రాముడు, గ్రూప్ ఏజెంట్ నెహ్రు,డిజీఎం పర్సనల్ సునీల్ ప్రసాద్, స్ట్రక్చర్ కమిటీ సభ్యులు అర్జీ టు ఏరియా బ్రాంచ్ కార్యదర్శి గంధం సాంబశివరావు, కే రాజారత్నం, శ్యాంసన్, ఆవుల రవికుమార్, మామిడి మహేందర్, మహేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story