- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు భద్రతకు టెక్నాలజీ, సమర్థవంతమైన అమలు కీలకం
రోడ్డు భద్రతను బలోపేతం చేయాలంటే టెక్నాలజీ ఆధారిత ఎన్‌ఫోర్స్‌మెంట్, సమర్థవంతమైన అమలు, ప్రజల్లో అవగాహనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్, ఐపీఎస్ పేర్కొన్నారు.

దిశ, గండిపేట: రోడ్డు భద్రతను బలోపేతం చేయాలంటే టెక్నాలజీ ఆధారిత ఎన్‌ఫోర్స్‌మెంట్, సమర్థవంతమైన అమలు, ప్రజల్లో అవగాహనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్, ఐపీఎస్ పేర్కొన్నారు. తెలంగాణ రవాణా శాఖకు చెందిన ముగ్గురు ఆర్‌టీఓలకు రెండు నెలల పాటు నిర్వహించిన ఇండక్షన్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొని డి. జగదీష్, పి. భూషి రెడ్డి, చై సాయి చరణ్‌లకు సర్టిఫికెట్లు అందజేశారు. యూనిఫాం సేవల్లో ప్రతి నిర్ణయం ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉంటుందని, మోటార్ వెహికల్స్ చట్టం, నిబంధనలపై పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలని సూచించారు. సమర్థవంతమైన తనిఖీలు, వాహనాల ఫిట్‌నెస్, డ్రైవింగ్ లైసెన్సుల జారీలో నాణ్యత పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. తెలంగాణ రవాణా శాఖ అడిషనల్ కమిషనర్ సి. రమేష్ మాట్లాడుతూ.. అకాడమీలో అందించిన శిక్షణ ఫీల్డ్ స్థాయిలో అధికారుల పనితీరును మెరుగుపరుస్తోందని తెలిపారు. శిక్షణ పొందిన ఆర్‌టీఓలు సేవా దృక్పథం, నాయకత్వం, క్రమశిక్షణ, ప్రజాసేవ పట్ల మరింత అంకితభావంతో పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, రవాణా శాఖ అధికారులు, అకాడమీ సిబ్బంది పాల్గొన్నారు.






