- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఎల్వో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష
కలెక్టర్ సత్య ప్రసాద్, అర్బన్, రూరల్ మండలాల పరిధిలో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం నమోదు శాతాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

దిశ, జగిత్యాల కలెక్టరేట్: జగిత్యాల ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, అర్బన్, రూరల్ మండలాల పరిధిలో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం నమోదు శాతాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఎల్వోకు సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోపు ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిగా నింపించి, వాటిని త్వరితగతిన బీఎల్వోలకు అందజేసేలా విస్తృత అవగాహన కలల్పించాలని సూచించారు. ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ప్రతి ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వామి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో మధుసూదన్, జగిత్యాల అర్బన్, రూరల్ మండల తహసీల్దార్ లు రామ్ మోహన్, హకీమ్, సూపర్వైజర్లు, బీఎల్వోలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.






