- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోర్టు వివాదంలో ఉన్న భూములకు పరిహారమా..?
నల్లగొండ మండలంలోని అన్నెపర్తి గ్రామంలో కోర్టు వివాదంలో ఉన్న భూములకు పరిహారం చెల్లింపుల విషయంలో రెవెన్యూ అధికారుల తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

దిశ, నల్లగొండ బ్యూరో : నల్లగొండ మండలంలోని అన్నెపర్తి గ్రామంలో కోర్టు వివాదంలో ఉన్న భూములకు పరిహారం చెల్లింపుల విషయంలో రెవెన్యూ అధికారుల తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకే వివాదంలో ఉన్న కొన్ని సర్వే నంబర్లకు పరిహారం చెల్లించి, మరికొన్నింటికి నిలిపివేయడంపై బాధితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బాధితుల కథనం ప్రకారం.. అన్నెపర్తి గ్రామానికి చెందిన నూకల కార్తీక్ రెడ్డి, నూకల రాహుల్ రెడ్డిలకు సర్వే నంబర్ 326లో ఆరు ఎకరాల భూమి ఉంది. ఉదయ సముద్రం కాలువ నిర్మాణం కోసం ఇందులో 19 గుంటల భూమిని ప్రభుత్వం సేకరించగా, దానికి సుమారు రూ.4 లక్షల పరిహారం ప్రకటించింది.
వివాదంలో ఉన్న భూములు ..
అయితే ఇదే గ్రామంలోని సర్వే నంబర్లు 316, 325, 326, 327, 330లకు సంబంధించిన భూములపై హైదరాబాద్‌కు చెందిన రెడ్డి సునంద దాఖలు చేసిన ఓఎస్ నెం.192/2020 కేసులో కోర్టు స్టే ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయా సర్వే నంబర్లను రెవెన్యూ శాఖ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చినట్లు తెలిపారు. అయినప్పటికీ, సర్వే నంబర్ 325లో ఉదయ సముద్రం కాలువ నిర్మాణానికి భూమి కోల్పోయిన ఓ పట్టాదారుకు సుమారు రూ.11 లక్షల పరిహారం చెల్లించారని, అదే వివాదంలో ఉన్న తమకు మాత్రం పరిహారం నిలిపివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. అలాగే సర్వే నంబర్ 327లోని భూమికి సంబంధించి కూడా కోర్టు వివాదం కొనసాగుతున్నప్పటికీ భూ సేకరణ జరిగిందని, పరిహారం ప్రక్రియలో నిబంధనలు ఒకే విధంగా అమలు కావడం లేదని వారు పేర్కొన్నారు. 325/ఇ-6.04 ఎకరాలు, 326/అ-0.31 ఎకరాలు, 330/అ-1.34 ఎకరాలు, 330/ఆ-1.34 ఎకరాలు, 330/ఇ -1.34 ఎకరాలు, 330/ఈ-1.34 ఎకరాలు, 330/ఉ-1.34 ఎకరాలు, 330/ఊ -1.33 ఎకరాలు, 330/రు-0.34 ఎకరాలు, 316/ఊ-0.15 ఎకరాలు, | 327/ఆ-3, 4.00 ఎకరాలు, 326/ఆ-5.00 ఎకరాలు, 326/ఇ-5.00 ఎకరాలు, మొత్తం 33-౦౭ ఎకరాలు.
పరిహారం అందజేతలో పక్షపాతమేనా....?
అయితే స్టే ఉందంటే వివాదంలో ఉన్నట్టే లెక్క. కావున ఉదయ సముద్రం కాల్వ నిర్మాణం కోసం భూములు కొల్పోయిన పట్టదారులకు ప్రభుత్వం నుంచి ప్రకటించిన సొమ్ము పూర్తి తీర్పు తర్వాత అదికారులు అందజేయాలి. కానీ రెవెన్యూ అధికారులు బ్లాక్ లిస్టులో ఉన్న ఓ వ్యక్తి కి చెందిన 325 సర్వే నెంబర్ కు వచ్చిన సొమ్మ రూ. 11 లక్షలు అందజేసినట్లు తెలిసింది. కాబట్టి ఉదయం సముద్రం కాల్వ కోసం 316 సర్వే నెంబర్ లో భూమి కొల్పోయిన 19 గుంటలకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 4లక్షలు సంబందిత రైతుకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సమాచారం. అంతేగాకుండా నల్లగొండ పట్టణానికి చెందిన గోలి వెంకట రమణ తన తండ్రి గోలి కాశయ్య నుంచి దాదాపు 2007లో సర్వే నెంబర్ 327లో ఉన్న 8.07 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆ పట్టా పాసు బుక్ నెంబర్ టి.28200040918. అదే ఎడాది నుంచి కూడ కబ్జాలో ఉన్నారు. ఉదయం సముద్రం కాలువ నిర్మాణం కోసం 327 సర్వే నెంబర్ కు చెందిన 8.07 ఎకరాల భూమిలో నుంచి 1.12 ఎకరాల ప్రభుత్వం తీసుకున్నారు. దాని కోసం రూ. 9లక్షలు పరిహారం కింద ప్రకటించారు. ఈ భూమి కోర్టు వివాదంలో ఉన్న మాట వాస్తవం. ఏవరి వాదనలో న్యాయం ఉందో తెల్చాల్సింది కోర్టులే. తీర్పు రాకుముందే భూమి పరిహారం నిబంధనలకు ఇవ్వకూడదు. బ్లాక్ లిస్ట్ లో సర్వే నెంబర్ లలో ఒక నెంబర్ యాజమానికి ఇచ్చి మిగతా వాళ్లకు ఇవ్వకపోవడం అధికారి పక్షపాతానికి నిదర్శనం. దీనిపై బాధితులు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది.
ఆర్డిఒ ఇబ్బందలకు గురిచేస్తున్నారు..
నూకల కార్తీక్ రెడ్డి, అన్నెపర్తి
ఉదయం సముద్రం కాల్వ కోసం ప్రభుత్వం తీసుకున్న భూముల సర్వే నెంబర్ లు కోర్టు వివాదంలో ఉన్నాయి. అయితే వాస్తవంగా కోర్టు తీర్పు వచ్చిన తర్వాత భూములకు సంబందించిన పరిహారం భూమి యాజమానులకు అందజేయాలి. కానీ మాతో పాటుగా కోర్టు వివాదంలో ఉండి, బ్లాక్ లిస్ట్ లో ఉన్న యాజమానికి నల్లగొండ రెవెన్యూ అధికారి పరిహారం అందజేశారు. అదే పద్దతిలో మాకు ఇవ్వమంటే ఇష్టమున్న చోట చెప్పుకొండి... ఇవ్వనంటే ఇవ్వనని బెదిరిస్తున్నారు. దయచేసి కలెక్టర్ విచారణ చేసి నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోగలరు.






