రేషన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకు మాత్రమే గడువు!

by Kema Shiva Kumar |

తెలంగాణ రేషన్ కార్డు లబ్ధిదారులకు పౌర సరఫరాల శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది.

రేషన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకు మాత్రమే గడువు!
X

దిశ, వెబ్‌‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు పౌర సరఫరాల శాఖ (Civil Supplies Department) కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో ఉచితంగా రేషన్ కార్డు ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేసుకోవడానికి విధించిన గడువు ఈ నెల 31తో ముగియనుందని స్పష్టం చేసింది. రేషన్ కార్డులో పేరున్న ప్రతి సభ్యుడు గడువులోగా తమ e-KYC ని ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. లబ్ధిదారులు తమ రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులను తీసుకొని స్థానిక రేషన్ డీలర్ వద్ద లేదా సమీపంలోని ‘మీ సేవ’ (Meeseva) కేంద్రానికి గానీ వెళ్లి బయోమెట్రిక్, ఐరిస్ ద్వారా ఉచితంగా e-KYC చేయించుకోవచ్చు. ఒకవేళ నిర్ణీత గడువు లోపు e-KYC పూర్తి చేయని వారికి భవిష్యత్తులో రేషన్ పంపిణీ నిలిచిపోయే ప్రమాదం ఉందని పౌర సరఫరాల శాఖ హెచ్చరించింది. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం, ఇతర సరుకులు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపింది.

కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నకిలీ రేషన్ కార్డులను ఏరివేయడంతో పాటు, అర్హులైన అసలైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూసేందుకు పౌర సరఫరాల శాఖ ఈ e-KYC ప్రక్రియను తప్పనిసరి చేసింది. ఈ క్రమంలోనే లబ్ధిదారులు ఈ నెల 31వ తేదీ లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Next Story