- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సినిమాకు ఆయనకు సంబంధం లేదు.. అపోహలపై ఆమిర్ ఖాన్ క్లారిటీ
by Chukka Sudharani |
‘3 ఇడియట్స్’ సినిమాపై ఎన్నాళ్ల నుంచో ప్రచారంలో ఉన్న అపోహకు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు.

X
దిశ, సినిమా: ‘3 ఇడియట్స్’ సినిమాపై ఎన్నాళ్ల నుంచో ప్రచారంలో ఉన్న అపోహకు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ఇందులో ఆయన నటించిన ‘రాంచో’ పాత్రను లడఖ్‌కు చెందిన ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించారనే ప్రచారంపై క్లారిటీ ఇస్తూ.. ‘రాంచో పాత్రను సోనమ్ వాంగ్‌చుక్‌ను దృష్టిలో పెట్టుకుని రాశారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. ‘3 ఇడియట్స్’ తెరకెక్కించే టైమ్‌లో అసలు మాకు సోనమ్ వాంగ్‌చుక్ గురించి తెలియదు. ఆ పాత్రకు ఆయన జీవితానికి ఎలాంటి సంబంధం లేదు. అది కేవలం సంవత్సరాలుగా కొనసాగుతున్న ఒక అపోహ మాత్రమే. అయితే.. సినిమా పాత్రకు సంబంధం లేకపోయినా, సమాజం కోసం సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న సేవలు ఎంతో గొప్పవి’ అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించాడు ఆమిర్ ఖాన్.
Next Story






