మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధే లక్ష్యం: కలెక్టర్

by Kodari Anjali |

సెర్ప్ కార్యక్రమాల అమలులో అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు.

మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధే లక్ష్యం: కలెక్టర్
X

దిశ, కందనూల్: గ్రామీణ పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత, స్వయం సహాయక సంఘాల బలోపేతం, గ్రామీణ కుటుంబాల ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని జిల్లా కలెక్టర్ హెమంత కేశవ్ పాటిల్ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లోని ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో అమలవుతున్న సెర్ప్ కార్యక్రమాలు, సామాజిక చేరిక (సోషల్ మొబిలైజేషన్), స్త్రీ నిధి రుణాల పంపిణీ, జి రాంజి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, స్వచ్ఛ భారత్ మిషన్, ప్రజాపాలన కార్యక్రమాల అమలు, గ్రామీణాభివృద్ధి లక్ష్యాలు, వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర అంశాలపై కలెక్టర్ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

వర్షాల అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని..

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్లు, సోక్‌పిట్స్, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. గ్రామాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి గ్రామంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వర్షాల అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. రైతులు నష్టపోకుండా శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టేలా గ్రామస్థాయిలో సలహాలు, సూచనలు అందించాలని సూచించారు.

Next Story