తెలంగాణలో కొనసాగుతున్న SIR.. డిజిటలైజేషన్‌లో యాదాద్రి భువనగిరి జిల్లా టాప్

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-17 16:30:24  IST  )

తెలంగాణలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కొనసాగుతోంది.

తెలంగాణలో కొనసాగుతున్న SIR.. డిజిటలైజేషన్‌లో యాదాద్రి భువనగిరి జిల్లా టాప్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి నుంచి సేకరించిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పనులు వేగిరం అయ్యాయి. ఈ ప్రక్రియలో మొత్తం 3,38,26,421 ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్‌వోలు ప్రజలకు పంపిణీ చేసింది. పంపిణీ ప్రక్రియ ఇప్పటికే వంద శాతం విజయవంతంగా పూర్తయింది.

61.05 శాతానికి చేరిన డిజిటలైజేషన్

ఇక పంపిణీ చేసిన ఫారాల నుంచి సేకరించిన సమాచారాన్ని డిజిటలైజ్ చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,06,52,577 ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయింది. దీంతో తెలంగాణలో మొత్తం డిజిటైజేషన్ పురోగతి 61.05 శాతానికి చేరుకుంది. ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌లో 86.70శాతంతో యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో సిద్దిపేట 81.59శాతం, నల్గొండ 80.84 శాతంతో ముందంజలో ఉన్నాయి. ఇక పట్టణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కేవలం 31.72శాతం డిజిటైజేషన్‌తో చివరి స్థానంలో నిలిచింది. మిగిలిన సుమారు కోటిన్నర ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియను కూడా నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు పౌర పరిపాలనచ, ఐటీ విభాగాలు కో-ఆర్డీనేషన్‌తో పనిచేస్తున్నాయి.

Next Story