- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుష్కర ఘాట్ల యుద్ధ ప్రాతిపదికను సిద్ధం చేయాలి
రానున్న గోదావరి నది పుష్కరాలు భక్తులకు ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు అధికారులు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పేర్కొన్నారు.

దిశ, ఖానాపూర్ :-రానున్న గోదావరి నది పుష్కరాలు భక్తులకు ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు అధికారులు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా శుక్రవారం పర్యటించారు. ముందుగా ఖానాపూర్ పట్టణంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారములు డిజిటలైజేషన్ పనులను ఆయన పరిశీలించారు. మొత్తం ఓటర్ల వివరాలు, ఇప్పటివరకు సేకరించిన ఫారములు, ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన డేటాను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బీఎల్ఓ యాప్ పనితీరును కూడా చెక్ చేశారు. గడువులోగా ఆన్ లైన్ ప్రక్రియ పూర్తి చేయాలి అని, ఈ ప్రక్రియలో పారదర్శకత ఉండాలి అని పేర్కొన్నారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలి అని కలెక్టర్ స్పష్టం చేశారు. బూత్ లెవెల్ అధికారులు గ్రామాల్లో తిరిగి ఓటర్లకు ఫారములు నింపడంలో సహాయం చేయాలని ఆదేశించారు.
గోదావరి నది పుష్కర ఘాట్లను క్షుణ్ణంగా పరిశీలన
ఖానాపూర్ పట్టణ సమీపంలోని గోదావరి నది పుష్కర ఘాట్లను జిల్లా కలెక్టర్ సందర్శించారు. పుష్కరాలకు ఇంకా సమయం ఉన్నా ఇప్పటినుంచే ప్రాథమిక ఏర్పాట్లు ప్రారంభించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తులు సులభంగా ఘాట్లకు చేరుకునేందుకు రోడ్ల మరమ్మతులు, వసతి, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. ఘాట్లను పుణ్యస్నానాలకు అనువుగా శుభ్రం చేయాలని, భద్రతా చర్యలు పటిష్టంగా ఉండాలని సూచించారు.ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు , తహసిల్దార్ సుజాత, డిప్యూటీ తాసిల్దార్ మంజుల, ఎంపీడీవో రాధా రాథోడ్ , మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ సోయబ్ హుస్సేన్,ప్రజాప్రతినిధులు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






