- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానాస్పద స్థితిలో ఆర్ఎంపీ వైద్యుడు మృతి...
ఆర్ ఎం పి వైద్యుడు ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, కార్వాన్ : ఆర్ ఎం పి వైద్యుడు ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... కర్ణాటక బసవ కళ్యాణం ప్రాంతానికి చెందిన మన్నన్ అన్సార్ (45) ఆయుర్వేద ఆర్ఎంపీ వైద్యుడు గత కొన్ని సంవత్సరాలుగా లంగర్ హౌస్ బాద్దాద్ కాలనీలో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ డాక్టర్ కి మల్లేపల్లి లోని క్లినిక్ ఉంది. అయితే గత మూడు రోజుల నుంచి క్లినిక్ కు రాకపోవడంతో అందులో పనిచేసి అసిస్టెంట్ మహమ్మద్ ముజీబ్ గురువారం రాత్రి లంగర్ హౌస్ బాగ్దాద్ కాలనీ లోని డాక్టర్ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో డోరు పెట్టి ఉండడంతో తలుపులు ఎంతకీ తీయకపోవడంతో పాటు అందులో నుంచి దుర్వాసన కూడా రావడంతో స్థానికులతో పాటు పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు డాక్టర్ ఇంటికి చేరుకొని, డోర్ పైన ఉన్న వెంటిలేషన్ అద్దాలు పగలగొట్టి డోర్ ను తీసి లోపటికి వెళ్ళేసరికి ఆర్ఎంపీ డాక్టర్ మన్నన్ మృతి చెంది ఉన్నాడు. అయితే డాక్టర్ తలకింద మసాజ్ పెట్టుకుని ఉన్నాడు. షార్ట్ సర్క్యూట్ రావడం వల్లే మృతి చెందాడా...? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుడి పక్కనే ఎలక్ట్రిక్ హెడ్ మసాజర్ తల కింద పెట్టుకొని ఉన్నాడని, విద్యుత్ షాక్ లేదా ఇతర కారణాలతో మృతి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది ఉందని సిఐ తెలిపారు.






