- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో రోడ్డుపై ప్రత్యక్షమైన పెద్దపులి..
by Kodari Anjali |
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై శుక్రవారం పెద్దపులి ప్రత్యక్షమై వాహనదారుల్లో ఉత్కంఠ నెలకొంది.

X
దిశ, అమ్రాబాద్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై శుక్రవారం పెద్దపులి ప్రత్యక్షమై వాహనదారుల్లో ఉత్కంఠ నెలకొంది. మన్ననూర్ నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్న వాహనదారులకు రహదారిపై పెద్దపులి సంచరిస్తూ కనిపించింది. కొద్దిసేపు రోడ్డుపైనే నడుస్తూ కనిపించిన పులిని చూసిన ప్రయాణికులు తమ వాహనాలను నిలిపివేసి దూరం నుంచి వీక్షించారు. అనంతరం పెద్దపులి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోవడంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో అడవి జంతువులు సంచరించడం సహజమే అయినప్పటికీ, రహదారిపై పెద్దపులి కనిపించడం అరుదైన ఘటనగా స్థానికులు పేర్కొన్నారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు వేగ నియంత్రణ పాటిస్తూ, అటవీ శాఖ సూచనలను తప్పనిసరిగా అనుసరించాలని అధికారులు సూచిస్తున్నారు.
Next Story






