మొక్కజొన్న డబ్బులు చెల్లించడంలో అవకతవకలపై రైతుల ఆగ్రహం

by Kodari Anjali |

కొనుగోలు సొమ్ము తక్కువ జమ కావడంతో జడ్చర్ల తాసిల్దార్ కార్యాలయం ముందు రైతులు ధర్నా నిర్వహించారు.

మొక్కజొన్న డబ్బులు చెల్లించడంలో అవకతవకలపై రైతుల ఆగ్రహం
X

దిశ, జడ్చర్ల: రైతులు పండించిన మొక్కజొన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి డబ్బుల కోసం ఎదురు చూడడంతో రావలసిన డబ్బులకంటే తక్కువ డబ్బులు తమ ఖాతాల్లో జమ కావడంతో ఆగ్రహించిన అన్నదాతలు న్యాయం కోసం స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. జడ్చర్ల మండలానికి చెందిన కోడుగల్, పెద్దపల్లి, లింగంపేట, నసరుల్లాబాద్ తదితర గ్రామాల పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్, మే మాసాలలో రైతులు పండించిన మొక్కజొన్న ధాన్యాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సుమారు లక్ష 50వేల క్వింటాళ్లకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేసింది. గత రెండు నెలలుగా రైతులు తమ ఖాతాలో డబ్బులు పడతాయని ఎదురు చూడడంతో ఎట్టకేలకు రైతుల ఖాతాలలో ప్రభుత్వం ఇటీవల జమ చేసింది. దీంతో తమ ఖాతాల్లో పడ్డ డబ్బులను చూసి రైతులు ఒక్కసారిగా కంగుతిన్నారు. అయితే ఒక్కో రైతు లక్ష రూపాయలకు పైగా రావాల్సిన డబ్బులు కేవలం 80,000 వేల నుండి 85,000 మాత్రమే డబ్బులు తమ ఖాతాలో జమ కావడంతో ఆగ్రహానికి గురయ్యారు. ఇదెక్కటి న్యాయం అని రైతులు శుక్రవారం జడ్చర్ల తాసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.

అమ్మిన ధాన్యానికి రావాల్సిన డబ్బులు రాకుండా..

తాము అమ్మిన ధాన్యానికి న్యాయంగా రావాల్సిన డబ్బులు రాకుండా పిఎసిఎస్ అధికారులు, సిబ్బంది కారణం లేకుండా కోతలు విధించారని దీంతో ఒక్కో రైతుకు పది నుండి 25 వేల దాకా రూపాయలు తమ ఖాతాలలో తక్కువ డబ్బులు పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. పంట పండిన అనంతరం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నెలల తరబడి ఎదురుచూడడం ఒకవైపు అయితే ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రెండు నెలల అనంతరం తమ ఖాతాలలో న్యాయంగా రావాల్సిన డబ్బులు జమ చేయకుండా తక్కువ డబ్బులు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అమ్మిన ధాన్యానికి రావాల్సిన డబ్బులు రాకుండా చేసి తాము మరోసారి మనోవిదన్నకు లోన ఏవిధంగా చేసిన పిఎసిఎస్ పాలకమండలి తోపాటు పిఎసిఎస్ అధికారులను విచారించి ఈ ఘటనకు పాల్పడ్డ వారిని చట్ట ప్రకారం శిక్షించి సంబంధిత అధికారులు ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా రైతులు తాసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన విషయం తెలుసుకున్న జడ్చర్ల పట్టణ బిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు.

Next Story