నకిలీ లోన్లతో సైబర్ మోసం గుట్టురట్టు ..

by Taduka Kalyani |

నకిలీ ఆన్‌లైన్ లోన్ల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ముఠాను ఆదిలాబాద్ రూరల్ పోలీసులు ఛేదించి ప్రధాన నిందితుడు తిల్కర్ ఆకాశ్ అలియాస్ తలారి ఆకాశ్ ను అరెస్ట్ చేశారు.

నకిలీ లోన్లతో సైబర్ మోసం గుట్టురట్టు ..
X

దిశ,ఆదిలాబాద్ : నకిలీ ఆన్‌లైన్ లోన్ల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ముఠాను ఆదిలాబాద్ రూరల్ పోలీసులు ఛేదించి ప్రధాన నిందితుడు తిల్కర్ ఆకాశ్ అలియాస్ తలారి ఆకాశ్ ను అరెస్ట్ చేశారు. నిందితుడు సోషల్ మీడియా,వాట్సాప్ ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని నమ్మించి ప్రాసెసింగ్ ఫీజు, సర్వీస్ ఛార్జీల పేరుతో డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. దర్యాప్తులో ఇప్పటివరకు 30 మందికి పైగా బాధితులను ఇదే తరహాలో మోసం చేసినట్లు, నిందితుడిపై రాష్ట్ర వ్యాప్తంగా 11 సైబర్ క్రైమ్ ఫిర్యాదులు ఉన్నట్లు గుర్తించారు. కేసులో పోతాని వెంకట సాయి, గోవర్ధన్, అఖిల్, కమలాపురం కార్తీక్ పరారీలో ఉండగా,వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్, సిమ్ కార్డులు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే తక్షణ రుణాల ప్రకటనలను నమ్మవద్దని,సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయడంతో పాటు సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ ప్రజలకు సూచించారు.

Next Story