- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ బస్సు కిందపడి వ్యక్తి మృతి
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త లంకపల్లి సమీపంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది.

దిశ, సత్తుపల్లి : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త లంకపల్లి సమీపంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం నుంచి సత్తుపల్లికి వెళ్తున్న సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ డీలక్స్ బస్సు వెనుక చక్రాల కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. మృతుడు తల్లాడ మండలం రామానుజవరం గ్రామానికి చెందిన రత్నాకర్‌గా గుర్తించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, రత్నాకర్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. అయితే ఆయన అనారోగ్యంతో మనస్తాపానికి గురై ఉద్దేశపూర్వకంగా బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ఇది ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదమా అనే రెండు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






