- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకరికి బదులు మరొకరికి శ్రీవారి ఆలయ ప్రవేశం.. విమర్శల వెల్లువ
by Vemula.Srinu Prasad |
తిరుమలలో విజిలెన్స్ వైఫల్యం మరోసారి బయటపడింది. శ్రీవారి ఆలయంలో శుక్రవారం ‘ఆణివార ఆస్థానం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం తమిళ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఇందులో భాగంగా పది మందికి మహాద్వారం ప్రవేశం కల్పించారు....

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో విజిలెన్స్ వైఫల్యం మరోసారి బయటపడింది. శ్రీవారి ఆలయంలో శుక్రవారం ‘ఆణివార ఆస్థానం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం తమిళ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఇందులో భాగంగా పది మందికి మహాద్వారం ప్రవేశం కల్పించారు. శ్రీరంగం దేవస్థానం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అయితే శ్రీరంగం దేవస్థానానికి చెందిన 10 మంది అధికారులు, తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రికి ఆలయ ద్వారా దర్శనం కల్పించారు. కానీ వారిలో ఒకరికి బదులు మరొకరికి ప్రవేశం కల్పించారు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న విజిలెన్స్ అధికారులు గుర్తించలేకపోయారు. దీంతో భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. టీటీడీ విజిలెన్స్ మరోసారి వైఫల్యం చెందిందని ఆరోపిస్తున్నారు. ప్రధాన ఘట్టం సందర్భంలో కూడా నిబంధనలను పట్టించుకోకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు.
Next Story






