ఉద్యోగాల పేరుతో మోసం..ప్రధాన నిందితుడు అరెస్ట్..

by Taduka Kalyani |

ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి వద్ద రూ.5.30 లక్షలు వసూలు చేసి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ బాబర్ ను ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఉద్యోగాల పేరుతో మోసం..ప్రధాన నిందితుడు అరెస్ట్..
X

దిశ,ఆదిలాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి వద్ద రూ.5.30 లక్షలు వసూలు చేసి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ బాబర్ ను ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్లోబల్ ఫౌండేషన్ పేరుతో నకిలీ నియామక ఉత్తర్వులు సృష్టించి నిరుద్యోగులను మోసం చేసినట్లు దర్యాప్తులో తేలిందని డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి తెలిపారు.ఈ కేసులో మధ్యవర్తులైన పల్లికొండ కార్తీక్, రాహులపెంట సతీష్, వడేకర్ నవీన్ కుమార్లను గతంలోనే అరెస్ట్ చేయగా, తాజాగా ప్రధాన నిందితుడు మహ్మద్ బాబర్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి నకిలీ నియామక పత్రాలు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఉద్యోగాల పేరుతో డబ్బులు డిమాండ్ చేసే వారిని నమ్మవద్దని, మోసాలకు గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ సూచించారు.

Next Story