- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లాదుర్గం ఎస్ఐ పేరుతో ఫేక్ ఐడీల కలకలం..
అల్లాదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శంకర్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి, ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న ఉదంతం స్థానికంగా కలకలం రేపింది.

దిశ,అల్లాదుర్గం : అల్లాదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శంకర్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి, ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. అసలేం జరిగింది...? ఎస్ఐ శంకర్ పేరుతో ఒక అపరిచితుడు సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలను క్రియేట్ చేశాడు. ఆ అకౌంట్ల ద్వారా బాధితులకు మెసేజ్‌లు పంపుతూ, అత్యవసరంగా డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు గుర్తించారు. కొంతమందికి మెసేజ్‌లు వెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అప్రమత్తమైన ఎస్ఐ హెచ్చరికలు జారీ
ఈ విషయంపై ఎస్ఐ శంకర్ వెంటనే స్పందించారు. తన పేరుతో ఫేక్ ఐడీలను సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. తన నుంచి ఎటువంటి డబ్బు అభ్యర్థనలు లేదా మెసేజ్‌లు వెళ్లలేదని ఆయన స్పష్టం చేశారు. మండల ప్రజలు ఇటువంటి మోసపూరిత మెసేజ్‌లను నమ్మవద్దని, ఎవరూ తొందరపడి డబ్బులు పంపవద్దని ఎస్ఐ శంకర్ కోరారు. సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరైనా డబ్బులు అడిగితే ఫోన్ ద్వారా లేదా నేరుగా కలిసి నిజానిజాలు ధృవీకరించుకోవాలన్నారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే స్థానిక పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.






