చిట్యాల ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలి

by Ratna Kumari |

చిట్యాల పట్టణ కేంద్రంలో కొనసాగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం వినూత్నంగా నిరసన చేపట్టారు.

చిట్యాల ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలి
X

దిశ, చిట్యాల : చిట్యాల పట్టణ కేంద్రంలో కొనసాగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం వినూత్నంగా నిరసన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించిన నాయకులు అనంతరం ఫ్లైఓవర్ కింద కళ్లకు గంతలు కట్టుకొని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి మాట్లాడుతూ... ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి రెండేళ్లు పూర్తయినా పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపించారు. ఆరు నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించిన ప్రజాప్రతినిధులు ఇప్పటికీ పనులు పూర్తి చేయించలేకపోవడం వారి అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు.

చిట్యాల పట్టణంలో అధిక జనాభా, జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ కారణంగా ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో వ్యాపారులు, వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం, సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిట్యాల సింగిల్ విండో వైస్ చైర్మన్ మెండే సైదులు, నాయకులు జమాండ్ల శ్రీనివాస్ రెడ్డి, బొబ్బలి శివశంకర్ రెడ్డి, జిట్ట బొందయ్య, కౌన్సిలర్లు నిమ్మనుకోటి శ్రీను, ఎస్.కె. షబానా అజీముద్దీన్, కందాటి రమేష్ రెడ్డి, ఆగు అశోక్, కన్నెబోయిన శ్రీశైలం, రుద్రవరం యాదయ్య, మారగోని రమేష్, కృష్ణ నాయక్, ఆవుల ఆనంద్, జిట్ట శేఖర్, సాయిరెడ్డి ప్రతాపరెడ్డి, పోకల రాములు, కూనూరు శంకర్, పాల కృష్ణయ్య, రామగిరి జనార్దన్ రావు, రుద్రారపు కృష్ణ, బాలు, మాసపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Next Story