- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అథ్లెటిక్స్‌లో తెలంగాణ బిడ్డ సత్తా.. సత్కరించిన మంత్రి అడ్లూరి
నాలోని ఓర్డోస్‌లో జరిగిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల క్రీడా అకాడమీ విద్యార్థిని నారిమల్ల ప్రవళిక మెరిసింది. మహిళల 4×400 మీటర్ల రిలే పోటీలో భారత జట్టు విజయంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ...

దిశ, తెలంగాణ బ్యూరో: చైనాలోని ఓర్డోస్‌లో జరిగిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల క్రీడా అకాడమీ విద్యార్థిని నారిమల్ల ప్రవళిక మెరిసింది. మహిళల 4×400 మీటర్ల రిలే పోటీలో భారత జట్టు విజయంలో ఆమె కీలక పాత్ర పోషించింది. దీంతో భారత జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అథ్లెటిక్స్‌లో సత్తాచాటిన ప్రవళికను శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘనంగా సత్కరించారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ వేదికపై స్వర్ణ పతకం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే వారికి గ్రూప్-1 ఉద్యోగాలు ఇస్తామన్న నిర్ణయం క్రీడాకారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని మంత్రి చెప్పారు. ఈ విజయంలో కృషి చేసిన ప్రవళిక కోచ్ పస్పుల పరుశురాముడు, తల్లిదండ్రులను మంత్రి అభినందించారు.






