- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీనాక్షి నామినేషన్ తిరస్కరణ అంశం.. తొలిసారి స్పందించిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్
కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ ఫస్ట్ టైమ్ రియాక్ట్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) ఇటీవల మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమెపై తెలంగాణలో కేసులో ఉన్నాయంటూ.. ఆ విషయాన్ని అఫిడవిట్‌లో వెల్లడించక దాచేశారని విపక్ష బీజేపీ సభ్యులు రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. ఆ అంశంపై విచారణ చేపట్టిన ఆర్వో, మీనాక్షి నటరాజన్‌ను తిరస్కరించారు. దీంతో ఆమె రాజ్యసభకు పోటీలో లేకుండా పోయింది. అనంతరం ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాము ఎన్నికల కమిషన్ వ్యవహరాల్లో తలదూర్చలేమని ధర్మాసనం పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
అయితే, మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై ప్రధాన ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్ కుమార్ (Gnanesh Kumar) తొలిసారిగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫామ్స్ నింపే నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని అన్నారు. కేసు వివరాలు భర్తీ చేయాలని సమయం ఇచ్చినా మీనాక్షి సద్వినియోగం చేసుకోలేదుని తెలిపారు. రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయాన్ని కూడా సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని గుర్తు చేశారు. ఆర్వో నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని జ్ఞానేశ్ కుమార్ అన్నారు.






