- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి కేసులో ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష
గంజాయి అక్రమ నిల్వ కేసులో ఇద్దరు నిందితులకు మెదక్ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

దిశ,చేగుంట: గంజాయి అక్రమ నిల్వ కేసులో ఇద్దరు నిందితులకు మెదక్ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2019లో రామాయంపేట ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ని చేగుంట గ్రామంలో నమోదైన గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు మెదక్ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించినట్లు తెలిపారు. చేగుంట గ్రామానికి చెందిన తిల్పితియా రెడ్డి సింగ్, తిల్పితియా బబ్లు సింగ్ అలియాస్ యాషు సింగ్ నివాసంలో నిర్వహించిన దాడిలో 1.6 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకుని, ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నిందితులను దోషులుగా నిర్ధారించిన కోర్టు ఒక్కో నిందితుడికి రూ.1 లక్ష జరిమానా విధించింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ విజయ్ సిద్ధార్థ తెలిపారు.






