విడుదలకు సిద్ధమైన KJQ.. పోస్టర్‌తో సినిమాపై భారీ హైప్

by Chukka Sudharani |

1990 కాలం నేపథ్యంలో సాగే పీరియడ్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న చిత్రం ‘KJQ – King Jackie Queen’.

విడుదలకు సిద్ధమైన KJQ.. పోస్టర్‌తో సినిమాపై భారీ హైప్
X

దిశ, సినిమా: 1990 కాలం నేపథ్యంలో సాగే పీరియడ్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న చిత్రం ‘KJQ – King Jackie Queen’. ఇందులో 'దసరా', 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తుండగా.. నూతన నటి శశి ఓదెల హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. యుక్తి తరేజా మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే వినూత్నమైన టైటిల్, ఆకట్టుకునే ఫస్ట్ లుక్ పోస్టర్, పవర్‌ఫుల్ టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డగా.. తాజాగా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. 'కేజేక్యూ – కింగ్ జాకీ క్వీన్' ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో ముగ్గురు ప్రధాన పాత్రలను స్ప్లిట్ ఫ్రేమ్‌లో చూపించారు. మధ్యలో శశి ఓదెల ఇంటెన్స్ లుక్ లో ఆకట్టుకోగా, తుపాకీ గురిపెట్టి కనిపిస్తున్న దీక్షిత్ శెట్టి పాత్ర ఆకట్టుకుంది. కుడివైపు చేతిలో సిగరెట్‌తో యుక్తి తరేజా కనిపిస్తూ తన పాత్రలోని మిస్టరీని సూచిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కేకే గత ఏడాది కన్నుమూశారు. ఆయన సినిమాపై ఉన్న పాషన్, విజన్‌కి నివాళిగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

Next Story