- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ
గుంటూరు జిల్లా ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత చోటు చేసుకుంది. ..

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభంన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులు, నిర్వాసితుల పునరావాసం, అమరావతి నిర్మాణ పనులు, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులు, గోదావరి - పెన్నా నదుల అనుసంధాన ప్రక్రియ, కార్యాచరణ. విశాఖపట్నం దక్షిణ కోస్తా రైల్వే జోన్‌తో పాటు మౌలిక సదుపాయాలు, రైల్వే భూముల కేటాయింపు, జోన్ పూర్తిస్థాయి కార్యకలాపాల ప్రారంభంపై ఎంపీలతో చంద్రబాబు చర్చించారు.
అలాగే రాష్ట్రంలో నూతన పెట్రోలియం రిఫైనరీల ఏర్పాటు, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి, ఉపాధి కల్పన, సోషల్ మీడియా దుష్ప్రచారం, ఫేక్ న్యూస్ కట్టడి, నియోజకవర్గాల సమస్యలు, పార్లమెంట్ ఉభయసభల్లో ప్రవేశపెట్టే వివిధ చట్ట సవరణలు, కొత్త బిల్లులు, నియోజక వర్గాల పునర్విభజన, మహిళా బిల్లు, SIR, అయోధ్య విరాళాలు వంటి అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశాలపై పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు చేసే కృషితో రాష్ట్రానికి భారీగా ప్రయోజనాలు తీసుకురాలని సూచించారు.






