హిమాయత్ సాగర్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

by Taduka Kalyani |

హిమాయత్ సాగర్‌ చెరువులో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

హిమాయత్ సాగర్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
X

దిశ, శంషాబాద్: హిమాయత్ సాగర్‌ చెరువులో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 10 గంటలకు డయల్-100కు వచ్చిన సమాచారంతో చెన్నమ్మ హోటల్ సమీపంలోని మసీదు వెనుక వైపున హిమాయత్ సాగర్‌లో ఓ వ్యక్తి శవం తేలియాడుతున్నట్లు సమాచారం రావడంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న ఆర్జీఐఏ పోలీసులు పరిశీలించగా.. సుమారు 40-45 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం నీటిలో వెల్లకిలా కనిపించింది. మృతుడు సుమారు 7 నుంచి 10 రోజుల క్రితమే మృతి చెందినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. చేపలు పట్టేందుకు వచ్చి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందిన ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదు. అతను నలుపు రంగు లోయర్, తెలుపు-నలుపు గీతలతో ఉన్న ఫుల్ టీ-షర్ట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి సంబంధీకులు ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.

Next Story