ఒడిశా తీరం వైపు వెళ్లొద్దు: మత్య్సకారులకు హెచ్చరిక

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-17 13:00:33  IST  )

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడన ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఒడిశాలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు...

ఒడిశా తీరం వైపు వెళ్లొద్దు: మత్య్సకారులకు హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఒడిశాలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే ఉత్తరకోస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కోస్తాంధ్ర వ్యాప్తంగా శుక్ర, శని వారాల్లో తేలికపాటి జల్లులు పడతాయని, ఆ తర్వాత మరో ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని పేర్కొంది. సముద్రం అలజడి నేపథ్యంలో మత్స్యకారులు ఒడిశా తీరం వైపు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Next Story