‘RC17’కి ముహూర్తం ఫిక్స్! షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?

by Chukka Sudharani |

ఇటీవల వచ్చిన ‘పెద్ది’తో సక్సెస్ అందుకున్న రామ్ చరణ్.. ఇప్పుడు RC17 కోసం సిద్ధం అవుతున్నాడు.

‘RC17’కి ముహూర్తం ఫిక్స్! షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: ఇటీవల వచ్చిన ‘పెద్ది’తో సక్సెస్ అందుకున్న రామ్ చరణ్.. ఇప్పుడు RC17 కోసం సిద్ధం అవుతున్నాడు. ‘గంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ పూర్తి అయినట్లు తెలుస్తుండగా.. అనౌన్స్‌మెంట్ నుంచే RC17కు సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో అప్డేట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. రామ్ చరణ్, సుకుమార్ ‘RC17’కి సంబంధించిన పూజ కార్యక్రమాలు సెప్టెంబర్‌లో జరగనున్నాయట. అలాగే.. నవంబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టబోతున్నారని ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. అంతే కాకుండా.. ఈ సినిమా రెండు భాగాల్లో రాబోతున్నట్లు కూడా వార్తలు వస్తుండగా.. ఓన్లీ సింగల్ పార్ట్ అంటూ కన్ఫర్మ్ చేస్తున్నారు ఫిలిమ్ క్రిటిక్స్.

Next Story