అంగన్‌వాడీ సిబ్బందికి గుడ్ న్యూస్.. కీలక పథకం వర్తింపు

by Vemula.Srinu Prasad |

అంగన్‌వాడీ సిబ్బందికి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. టీచర్లు, మినీ టీచర్లు, ఆయాలకు తల్లికి వందనం పథకాన్ని వర్తింపు చేస్తున్నట్లు ప్రకటించింది. ..

అంగన్‌వాడీ సిబ్బందికి గుడ్ న్యూస్.. కీలక పథకం వర్తింపు
X

దిశ, వెబ్ డెస్క్: అంగన్‌వాడీ సిబ్బంది(Anganwadi staff)కి కూటమి ప్రభుత్వం(Nda Government) గుడ్ న్యూస్ తెలిపింది. టీచర్లు(Theachers), మినీ టీచర్లు(Mini-teachers), ఆయాల(Aayas)కు తల్లికి వందనం పథకాన్ని వర్తింపు చేస్తున్నట్లు ప్రకటించింది. తల్లికి వందనం పథకం(Thalliki Vandanam Scheme) పరిధిలోకి తీసుకురావాలంటూ అంగన్‌వాడీలు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం తాజాగా ప్రకటన విడుదల చేసింది. దీంతో సీఎం చంద్రబాబుకు అంగన్‌వాడీల కుటుంబాలు ధన్యవాదాలు తెలిపాయి. ఈ సందర్బంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి(Minister Gummadi Sandhya Rani) మాట్లాడుతూ అంగన్ వాడీలకు ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు. అర్బన్, రూరల్ అంగన్‌‌‌వాడీలందరికీ ఈ పథకం వర్తిస్తుందని ఆమె స్పష్టం చేశారు.

Next Story