- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జోహో క్లాసెస్ 2.0.. విద్యారంగంలో AI సరికొత్త విప్లవం!
జోహో క్లాసెస్ 2.0లో ఏఐ ట్యూటర్ ద్వారా లెర్నింగ్ సపోర్ట్ లభిస్తుంది.

దిశ, ఫీచర్స్ : ఆన్‌లైన్‌లో క్లాసులు వినాలనుకునే విద్యార్థులు, ఉపాధ్యాయులందరికీ గుడ్ న్యూస్. ఏంటంటే.. ప్రముఖ భారతదేశపు SaaS సంస్థ జోహో తన జోహో క్లాసెస్ 2.0ను ప్రకటించింది. ఇది ఏఐ ఆధారిత లెర్నింగ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ అనే విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి సమయంలో సాధారణ అసైన్‌మెంట్ టూల్‌గా ప్రారంభమైన ఈ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు అడ్వాన్స్‌డ్ ఏఐ టెక్నాలజీతో టీచింగ్‌ను మరింత స్మార్ట్‌గా, లెర్నింగ్‌ను పర్సనలైజ్ చేసే పవర్‌ఫుల్ టూల్‌గా మార్చింది. ప్రపంచ వ్యాప్తంగా 500కు పైగా విద్యా సంస్థలు, ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు దీనిని వాడుతున్నాయి. కాగా ఇప్పుడు జోహో క్లాసెస్ 2.0ను సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్నదని నిపుణులు చెబుతున్నారు.
ఫుల్ లెర్నింగ్ సపోర్ట్
జోహో క్లాసెస్ 2.0 (Zoho Classes 2.0) ఆన్‌లైన్ క్లాసులు వినాలనుకునేవారికి చక్కటి వేదికగా నిలుస్తుందని సాంకేతిక నిపుణులు సైతం అంటున్నారు. ఇందులోని ప్రధాన ఫీచర్లు విద్యారంగాన్ని పూర్తిగా మార్చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ఏఐ ట్యూటర్ (AI Tutor) ద్వారా ప్రతీ విద్యార్థికి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా లెర్నింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఏఐ సహాయంతో లెసన్ ప్లాన్స్ తయారీ, పూర్తి కోర్సును క్రియేట్ చేయడం, బోధించడం సులభం అవుతుంది. అలాగే టీచర్లకు అసైన్‌మెంట్లకు సంబంధించి ఆటోమేటెడ్ మూల్యాంకనం లభించడంవల్ల సమయం ఆదా అవుతుంది. అంతేకాకుండా భారతదేశంలోని 22 షెడ్యూల్డ్ భాషలన్నింటికీ ఇది పూర్తి సపోర్ట్ అందిస్తుంది కాబట్టి ప్రాంతీయ భాషల్లోని విద్యార్థులు కూడా సౌకర్యంగా ఉపయోగించవచ్చు అంటున్నారు నిపుణులు.
వీరికి పూర్తిగా ఉచితం..
జోహో తన 2.0 ప్లాట్‌ఫామ్‌ను కేవలం కమర్షియల్ అవసరాలకు వినియోగించుకుంటుంది అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే ఇది సెంట్రల్ & స్టేట్ గవర్నమెంట్ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలకు పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. వందమంది వరకు విద్యార్థులు ఉన్న పాఠశాలలు, టీచర్లు కూడా ఎలాంటి ఖర్చు లేకుండా ఉపయోగించవచ్చు. గూగుల్ క్లాస్‌రూమ్ (Google Classroom) &Moodleతో పోటీ పడుతూ, భారత్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆధారిత విద్యను చౌకగా, సులభంగా అందుబాటులోకి తెచ్చే దిశగా జోహో అడుగులు వేస్తోంది. ఇది టీచర్లపై పని భారాన్ని, ఒత్తిడిని తగ్గించి, విద్యార్థులకు మరింత వ్యక్తిగతమైన, ప్రభావవంతమైన అనుభవం కల్పిస్తుందని, చదువులో నాణ్యతను పెంచుకోవడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.






