- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైద్య సేవలతో ప్రజల్లో విశ్వాసం పెంచాలి: కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి
ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అన్నారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలని, అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అధికారులను ఆదేశించారు.శుక్రవారం పోచమ్మకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు రెవెన్యూ కాలనీ, పోచమ్మకుంట అంగన్‌వాడీ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజువారీగా వచ్చే రోగుల సంఖ్య, అందిస్తున్న వైద్య సేవలు, రోగుల నమోదు ప్రక్రియ, ప్రాథమిక పరీక్షలు, కంప్యూటరైజ్డ్ రికార్డులను వైద్యాధికారి డా. ఎన్. దీప్తిని అడిగి తెలుసుకున్నారు. రోగుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు.
అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
రెవెన్యూ కాలనీ, పోచమ్మకుంట అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా పోషకాహారం అందించాలని, కేంద్రాల్లో పరిశుభ్రత, హాజరు, ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎం అండ్ హెచ్ ఓ డా. మదన్ మోహన్ రావు, వైద్య సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.






