హుస్నాబాద్‌లో వరుస దొంగతనాల కేసు ఛేదించిన పోలీసులు

by Taduka Kalyani |

హుస్నాబాద్, అక్కన్నపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో జూన్ 18, జూన్ 26, జూలై 2 తేదీల్లో వరుస చోరీలకు పాల్పడిన నిందితుడు రౌతు పవన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

హుస్నాబాద్‌లో వరుస దొంగతనాల కేసు ఛేదించిన పోలీసులు
X

దిశ, ​హుస్నాబాద్: హుస్నాబాద్, అక్కన్నపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో జూన్ 18, జూన్ 26, జూలై 2 తేదీల్లో వరుస చోరీలకు పాల్పడిన నిందితుడు రౌతు పవన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ కె. శ్రీధర్ నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారించగా, దొంగిలించిన సొత్తును కరీంనగర్‌లో దాచినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కరీంనగర్‌లో తనిఖీలు చేపట్టి.. 11 కిలోల పంచలోహ విగ్రహం, 56 గ్రాముల బంగారం, 76 గ్రాముల వెండి, రూ. 23,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ​ఈ కేసును అత్యంత చాకచక్యంగా ఛేదించిన హుస్నాబాద్ ఎస్సై పి. లక్ష్మారెడ్డి, హెచ్ రవీందర్, పీసీలు ఎన్. నరేశ్, డి. శ్రీనాథ్ మరియు సీసీఎస్ (CCS) బృందాన్ని హుస్నాబాద్ ఏసీపీ సదానందం గారు ప్రత్యేకంగా అభినందించారు. తక్కువ సమయంలో నిందితుడిని పట్టుకుని సొత్తు రికవరీ చేసిన సిబ్బంది ప్రతిభను అధికారులు కొనియాడారు.

Next Story