సాంఘిక సంక్షేమ గురుకులంలో అటెండర్ ఆత్మహత్యాయత్నం..!

by Kodari Anjali |

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో విధులు నిర్వహిస్తున్న అటెండర్ సొప్పరి లక్ష్మి ఆత్మహత్యాయత్నానికి యత్నించిన ఘటన కలకలం రేపింది.

సాంఘిక సంక్షేమ గురుకులంలో అటెండర్ ఆత్మహత్యాయత్నం..!
X

దిశ, ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో విధులు నిర్వహిస్తున్న అటెండర్ సొప్పరి లక్ష్మి ఆత్మహత్యాయత్నానికి యత్నించిన ఘటన కలకలం రేపింది. కళాశాల ప్రిన్సిపాల్ మానసిక వేధింపుల కారణంగానే ఆమె ఈ నిర్ణయానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గత మూడు నెలలుగా కళాశాల విధులతో సంబంధం లేని వ్యక్తిగత పనులు చేయించేవారని తెలిపారు. వంట పనులు చేయించడం, ఇంటి గిన్నెలు తోమించడం, ప్రిన్సిపాల్ మనవడిని చూసుకోవడం వంటి వ్యక్తిగత పనులను అప్పగించేవారని ఆరోపించారు. ఇలాంటి పనులు చేయడం నావల్ల కాదు అనడంతో ప్రిన్సిపాల్ వేధింపులు పెరిగాయని ఆరోపిస్తున్నారు. తరచూ మందలించడం, తోటి సిబ్బంది ఎదుట అవమానించడం,సెలవులు మంజూరు చేయకుండా మానసికంగా వేధించినట్లు పేర్కొన్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మి శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి యత్నించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న సహోద్యోగులు, పోలీసులు వెంటనే స్పందించి ఆమెను 108 లో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Next Story